
ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించాలి
తాడ్వాయిలో ఫిర్యాదులు నిల్
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 92 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్‌లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్వేత మాట్లాడుతూ.. ప్రజావాణికి ఎలాంటి ఫిర్యాదులు రాలేవన్నారు. ఏమైనా సమస్యలుంటే వచ్చే సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఎంపీడీవో సయ్యద్‌సాజీద్‌అలీ, ఎంపీవో సవిత, ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.