
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి సజ్జనపల్లి శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3,220 నగదుతోపాటు 4 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
● కాపాడిన తోటి రైతులు
బాన్సువాడ రూరల్: మండలంలోని బుడిమి గ్రామానికి చెందిన జంబిక సాయిలు అనే వ్యక్తి సోమవారం మంజీరా నదిలో చిక్కుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నదికి ఆనుకుని ఉన్న పొలంలో నీళ్లు చూసేందుకు వెళ్లాడు. అదే సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టు 12 గేట్ల నుంచి నీటిని వదలడంతో రైతు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయిలు గ్రామస్తులతోపాటు 100 నెంబర్‌కు ఫోన్‌చేసి సహాయం కోరడంతో స్పందించిన బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటి రైతులు ఖమ్రోద్దీన్, చందునారాయణ, చాకలి అంజయ్యలు సుమారు 300 మీటర్లు ఈత కొట్టుకుంటూ నదిలోకి వెళ్లి సాయిలును కాపాడారు. కానిస్టేబుళ్లు పవన్‌కుమార్, పృథ్వి సహాయక చర్యలు పర్యవేక్షించారు. రైతు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తోటి రైతులు చేసిన ధైర్య సాహసాలను పలువురు ప్రశంసించారు.
బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరిందని, అదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని బీజేపీ నాయకులు సోమవారం ఆర్టీసీ డీఎం సరితాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ఇటీవల క్యాంటీన్‌లో పైకప్పు కూలిపోయిందని.. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు గాయాలు కాలేదన్నారు. వెంటనే బస్టాండ్‌ను కూల్చి వేసి నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. నాయకులు చిరంజీవి, చీకట్ల రాజు, ఉమేష్, గజ్జల మహేష్, రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, గంగారాం, నాగరాజు తదితరులున్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర, ధర్మారెడ్డి గ్రామ శివారుల్లో బోరుమోటార్లను చోరీ చేసి పారిపోతున్న ఇద్దరిని స్థానిక రైతులు పట్టుకొని పోలీసులకు అ ప్పగించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌ డ్ కథనం ప్రకారం..గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన గౌస్ పాష, మో సిన్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి మండలంలోని బంజర ఫంక్షన్‌హాల్ సమీపంలో పంట పొలాల నుంచి బోరుమోటార్లను చోరీచేసి ఎల్లారెడ్డి వైపు వెళ్లారు. అలాగే ధర్మారెడ్డి గ్రామ శివారులోనూ పంట పొలాల నుంచి బోరుమోటార్లను ఎతుకెళ్లే సమయంలో స్థానిక రైతులు గమనించి వారిని పట్టుకొని నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన తెనుగు రమేష్ అనే బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు.

పేకాడుతున్న ఏడుగురి అరెస్టు