
బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లకు ‘పింఛన్’ కిట్ల పంపిణీ
కామారెడ్డి క్రైం : పింఛన్ల పంపిణీ మరింత మెరు గ్గా జరిగేందుకు జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌లకు కొత్త మొబైల్ ఫోన్‌లు, ఫింగర్‌ప్రింట్ డివైజ్‌లు, ఇతర సాంకేతిక పరికరాలతో కూడిన కిట్‌లను సోమవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ మొత్తం 211 సెట్‌లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఆధునిక పరికరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సులువుగా జరుగుతుందన్నా రు. లేదంటే మంత్ర డివైజ్ ద్వారా గానీ, ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా గానీ పింఛన్లు పంపిణీ చే యవచ్చన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పరికరాలతో ఎక్కువ మందికి పింఛన్‌లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మ యి, అధికారులు పాల్గొన్నారు.