
ఇబ్బందులు కలగకుండా చూడండి
● వినాయక ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : గణేశ్ ఉత్సవాలలో భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు, అపాయాలు కలగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమ వారం ఆయన జిల్లా కేంద్రంలో గణేశ్ నవరాత్రి ఉ త్సవాలు, నిమజ్జన శోభాయాత్రలకు సంబంధించి న రూట్ మ్యాప్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర, అధికారుల తో కలిసి పరిశీలించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, మత్స్య, ఆర్‌అండ్‌బీ శాఖలు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. చెరువు నిండుగా ఉంది కాబట్టి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతి జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సక్రమంగా జరిగేలా అధికారులకు సహకరించాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు.