
పీఈటీ కోసం విద్యార్థుల ధర్నా
కామారెడ్డి రూరల్ : పీఈటీ కోసం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు సోమవారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పాఠశాలలో శివరాం అనే పీఈటీ ఉండేవారన్నారు. రెండున్నరేళ్ల క్రితం ఆయనను డిప్యుటేషన్‌పై హైదరాబాద్ పంపించారని, దీంతో ఇక్కడి విద్యార్థులతో ఆటలు ఆడించేవారు లేకుండాపోయారని పేర్కొన్నారు. కలెక్టర్, డీఈవోలను కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదన్నారు. వెంటనే శివరాం డిప్యుటేషన్ రద్దు చేసి, ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.