
ఘనంగా తీజ్ సంబురాలు
ఎల్లారెడ్డి: సోమర్యాగడితండాలో ఆదివా రం తీజ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉ త్సవానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసంలో పెళ్లికాని యువతులు గోధుమ బుట్టలతో తీజ్ మాతను పూజిస్తారని అన్నారు. ఆచారంగా వస్తున్న ప్రతీ పండగను ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. బంజారా సంఘం నాయకులు రాములు, సర్దార్ ఉన్నారు.
గజ్యానాయక్‌తండాలో..
మాచారెడ్డి: గజ్యానాయక్ తండాలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని యువతులు 9 రోజుల పాటు నిష్టతో గోధుమ కుదుళ్లపై నీళ్లు పోసి తొమ్మిదవ రోజు ఆ కుదుళ్లతో డీజే వాయిద్యంతో వారి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఊరేగించిన అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
కొట్టాల్‌గడ్డతండాలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): కొట్టాల్‌గడ్డ తండాలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ నారుతో సేవాలాల్ మందిరం వరకు ర్యాలీగా చేరుకొని సేవాలాల్, జగదాంబ మాతామాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా జాగృతి అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్‌గౌడ్ పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో అక్రమ మద్యాన్ని పట్టుకొని నిర్వాహకుడిపైఊ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావ్ ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలోని తిమ్మనగర్ రోడ్డులో ఉన్న సాయి కూల్‌డ్రింక్స్ షాప్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. దాడిలో 25 లీటర్ల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. షాపు యజమాని పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

ఘనంగా తీజ్ సంబురాలు

ఘనంగా తీజ్ సంబురాలు

ఘనంగా తీజ్ సంబురాలు