
టీపీడీఈఏ సర్కిల్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
సుభాష్‌నగర్: తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ (టీపీడీఈఏ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్ ఎన్నికల అధికారిగా, సర్కిల్ సెక్రెటరీ సంపత్ సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అంతకుముందు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కంపెనీ జనరల్ సెక్రెటరీ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్, కంపెనీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మల్లికార్జున్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తోట రాజశేఖర్, కంపెనీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, సర్కిల్ కార్యదర్శి ఏ కాశీనాథ్, కోశాధికారి పి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి ఆర్ సుమిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తేజ, ఆఫీస్ సెక్రటరీ కెఎస్‌ఆర్ మూర్తి, డివిజన్ సెక్రెటరీలు జి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, నాయిని కృష్ణ, శంకర్ గౌడ్, గంగాధర్, కోశాధికారులు భరత్, గిరిధర్, భరత్ కుమార్, కాంతారావు, జుబేర్, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శంకర్‌ను సస్పెన్షన్ చేస్తూ డీఈవో అశోక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థులను కొట్టడం, వారి కళ్లల్లో కారం చల్లడం వంటి ఆరోపణలు రావడంతో ఎంఈవో గంగాధర్ చేపట్టిన విచారణ, నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు.
సదాశివనగర్: మండల కేంద్రంలోని ఓ గోల్డ్‌షాప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన బంజ ప్రభులింగం అనే వ్యక్తి గోల్డ్‌షప్ ఫర్నీచర్ కోసం ఓ దుకాణంలో పనులు చేపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పనులు జరుగుతున్న షాప్‌లోకి చొరబడి ఫర్నీచర్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో మండల కేంద్రానికి అవుసుల శ్రీధర్ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.