
వంగిన విద్యుత్ స్తంభాలు..
మద్నూర్(జుక్కల్): గోజేగావ్, సోనాల గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ తీగలు సైతం తెగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పశువులు, ఎడ్లబండ్లపై వెళ్లే వారు విద్యుత్ తీగల వద్ద వంగి జాగ్రత్తగా వెళ్తున్నారు. విద్యుత్ తీగలను గమనించకపోతే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి వంగిన స్తంభాలను సరిచేయాలని కోరుతున్నారు.
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ 45 సంవత్సరాల రాజకీయ జీవన ప్రస్థానం పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ఆయన 45 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉంటూ ఆయన చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించారు.
సదాశివనగర్: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన 1984–85 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. మొదటగా పదో తర గతి బ్యాచ్‌కు చెందిన గంగాగౌడ్, సత్యనారాయ ణ, బాలకిషన్, నారాయణ వివిధ కారణాలతో మరణించారు. వారికి సంతాపం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

వంగిన విద్యుత్ స్తంభాలు..

వంగిన విద్యుత్ స్తంభాలు..