
మట్టి వినాయకుల వితరణ
రాజంపేట: వినాయక చవితిని పురస్కరించుకుని రాజంపేట వాస్తవ్యుడు కొండ మహదేవ్ గుప్తా (రామకృష్ణ మెడికల్) ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట ఆ ర్యవైశ్య సభ్యులకు మట్టి వినాయకులను అందజేసిన ట్లు గ్రామ ఆర్యవైశ్య అధ్యక్షుడు ముత్యపు సిద్ధరాము లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న కొండ మహదేవ్ గుప్తాకు రాజంపేట ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మొగిలిపల్లి రమేష్, రాజు, బంధం అనిల్, రాజు పాల్గొన్నారు.
రాజంపేటలో.. విగ్రహాల పంపిణీ
రాజంపేట: మండల కేంద్రానికి చెందిన బల్ల ఆంజనేయులు అనిల్ ఆదివారం కామారెడ్డి పరిధిలోని ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో వేయి మందికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడటంలో తన వంతు బాధ్యతగా 5 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నేతలు గుర్రాల రవికుమార్, వడ్ల రవి, అంజగౌడ్, సాయి,భాస్కర్, మహేష్, పిట్ల సింహం పాల్గొన్నారు.

మట్టి వినాయకుల వితరణ