
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
కామారెడ్డి జీసీడీవో సుకన్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని కామారెడ్డి జీసీడీవో సుకన్య ఆదేశించారు. నాగిరెడ్డిపేట కస్తూర్బా పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతనుపరిశీలించారు. ఉపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆమె సూచించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 19 కస్తూర్బా పాఠశాలల్లో 5,800 మంది విద్యార్థినులు చదువుతున్నారన్నారు. వీటిలో 13 పాఠశాలల్లో ఇంటర్‌విద్య అమలవుతుందని చెప్పారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రత్యేకాధికారిణి గీతతోపాటు ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.