
ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు తాము సాగు చేసిన పంటలకు రసాయన ఎరువులను, పురుగు మందులను మోతాదుకు మించి వాడొద్దని ఎల్లారెడ్డి ఏడీఏ సుధామాధురి అన్నారు. గురువారం ఆమె, ఏవో రాజలింగంతో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. దుర్గం శివారులో మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోడానికి నానో యూరియా, డీఏపీ వాడాలని సూచించారు. నానో ఎరువుల నాణ్యత, ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం మండల కేంద్రంలో పలు రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు.