
నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దు
ప్రమాదాలకు అనువుగా ఉన్న నిషేధిత ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లవద్దని, విహార యాత్ర విషాదానికి కారణం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. వర్షాలు, వరద నీటి ప్రవాహాల సమయంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టును ఎస్పీ సందర్శించారు. పర్యాటకులతో మాట్లాడారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు పోలీసుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అంతకుముందు అచ్చంపేట గెస్ట్‌హౌస్‌లో బాన్సువాడ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య, బిచ్కుంద సీఐ రవికుమార్, బాన్సువాడ టౌన్ సీఐ అశోక్, స్థానిక ఎస్సై శివకుమార్, సిబ్బంది ఉన్నారు.