
వాగుల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): అచ్చంపేట, మర్‌పల్లి, లింగంపల్లి, ఆరేడ్ గ్రామాల పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను బుధవారం స్థానిక ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వరదల వల్ల వంతెనలు నీటమునగడంతో ఆ రోడ్లపై ప్రయాణం చేయవద్దని ఆయా గ్రామాల ప్రజలకు ఎంపీడీవో సూచించారు. జీపీ కార్యదర్శి తుకారాం తదితరులున్నారు.
రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్‌పేట్, మర్కల్ గ్రామాల్లో గల బీటీ రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర్మారావ్‌పేట్ శివారులోని పెద్దమ్మ ఆలయం వద్ద బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీగా గుంతలు పడటంతో ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులు దృష్టి సారించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు.

వాగుల పరిశీలన