
తండాలపై డెంగీ పంజా..!
అదుపులోకి వచ్చాయి
● సోమారంపేటలో
20 మందికి పాజిటివ్
● ప్రయివేట్ ఆస్పత్రులలో
చేరుతున్న బాధితులు
మాచారెడ్డి: గిరిజన తండాలపై డెంగీ పంజా విసురుతోంది. చాలా మంది జ్వరపీడితులు ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని సోమారంపేట, ఎల్లంపేట, బంజపల్లి, సర్దాపూర్ తండాల్లో గిరిపుత్రులు జ్వరాల బారినపడి మంచం పట్టారు. ఒక్క సోమారంపేట గ్రామంలోనే 20 మందికి డెంగీ సోకి ప్రైవేట్ ఆస్పత్రులలో చేరినట్లు ఆయా గ్రామాల ప్రజలు సాక్షికి తెలిపారు. ఇటీవల పాల్వంచ మండలం భవానిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్ నగర్‌లో దాదాపు 25 మందికి డెంగీ సోకింది. మాచారెడ్డి వైద్యాధికారి ఆదర్శ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వరపీడితులకు వైద్యం అందించారు.
ఓ మహిళకు సీరియస్
మండలంలోని గజ్యా నాయక్ తండాకు చెందిన ఓ మహిళకు డెంగీ సోకి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల అనంతరం కోలుకొని ఇంటికి చేరింది.
మండలంలోని పలు గ్రామా ల్లో వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. సోమారంపేటలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం జ్వరాలు అదుపులోకి వచ్చాయి. అయి నా మా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు.
–ఆదర్శ్, వైద్యాధికారి, మాచారెడ్డి

తండాలపై డెంగీ పంజా..!