ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ

Aug 21 2025 6:48 AM | Updated on Aug 21 2025 6:48 AM

ఎల్లా

ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ

ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ రేపు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఫర్నిచర్‌కు వేలం పాట ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ ఆకస్మికంగా ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల వాష్‌రూంలు, లైబ్రరీ, ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నా రా అని అడిగారు. ఆయన వెంట తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ గాంధీ, ఉపాధ్యాయులు జహంగీర్‌, రాజశేఖర్‌, లక్ష్మణ్‌సింగ్‌, బ ల్వంత్‌రావు, విద్యారమణ తదితరులున్నారు.

కామారెడ్డి క్రైం: పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వాడకంలో లేని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఫర్నిచర్‌, ఇతర వస్తువులకు శుక్రవారం(22న) జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, కంప్యూటర్‌ సామగ్రి, జిరాక్స్‌ మిషన్లు, టెంట్‌లు, షామియానాలు, ఫర్నిచర్‌, ఇనుప వస్తువులను వేలం ద్వారా విక్రయించనున్నామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటల కల్లా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం ముగిసిన వెంటనే డబ్బులు చెల్లించి వస్తువులు తీసుకువెళ్లాలని సూచించారు. సందేహాలకు 87126 86115(ఆర్‌ఎస్సై చంద్రశేఖర్‌), 87125 25970 (ఏఆర్‌ కానిస్టేబుల్‌ అంకుష్‌)లను సంప్రదించాలన్నారు.

కామారెడ్డి టౌన్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విద్యార్థులకు చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి గోపాల్‌ సింగ్‌ ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు శివ, కార్యదర్శి సునీల్‌, నాయకులు సూర్యపాల్‌, తరుణ్‌ తదితరులున్నారు.

కొనసాగుతున్న

పీజీ, బీఈడీ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పీజీ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో 2,366 మంది విద్యార్థులకు 2,240 మంది హాజరుకాగా 126 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో మొత్తం 1,444 మంది విద్యార్థులకు 1,379 మంది హాజరుకాగా 65 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్‌ తెలిపారు.

ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ 1
1/1

ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement