
సంక్షిప్తం
‘విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి’
కామారెడ్డి అర్బన్:వినాయక విగ్రహాల తరలింపులో మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ సూ చించారు. మంగళవారం పట్టణంలోని ప లు ప్రాంతాల్లో పర్యటించారు. సిబ్బందికి పలు సూ చనలు ఇచ్చారు.పది ఫీట్ల కంటే ఎత్తున్న గణేష్ విగ్రహాల ను తరలించే క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు.మండపాల నిర్వహకులు ముందుగా విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తే తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. విద్యు త్ వైర్లపై చిందరవందరగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
నిజాంసాగర్(జుక్కల్): ఆరేడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు యాటకారి నారాయణను బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పరామర్శించారు. కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణ డిశ్చార్జి అయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరేడ్ గ్రామానికి వచ్చి నాయకుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు దుర్గారెడ్డి, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప
కామారెడ్డి టౌన్: మండలంలోని తిమ్మక్‌పల్లి, ఇస్రోజీవాడి గ్రామంలో పలువురిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్త సాయిలు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భార్య ఇంద్రకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే బక్క మల్లయ్య, దుబ్బాక ఎల్లవ్వ, సాకలి లక్ష్మిలు చనిపోవడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే తిమ్మకపల్లిలో ఇటీవల మృతి చెందిన కవలలు రామ, లక్ష్మణ్‌ల కుటుంబాన్ని పరామర్శించి వారి తండ్రి నర్సింలుకు ఆర్థిక సాయం అందజేశారు. గొల్ల గంగయ్య, జిల్లేడు లక్ష్మి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గూడెం బాలరాజ్, మాజీ సర్పంచ్‌లు రాజు పాల్గొన్నారు.
ఎమ్మారీఎస్ మండల కమిటీ ఎన్నిక
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఎమ్మార్పీఎస్ కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోచయ్య, ఉపాధ్యక్షుడిగా గన్నారం అల్లూరి, ప్రధాన కార్యదర్శిగా మాసాని సాయిలు, కోశాధికారిగా సాయిలు, ప్రధాన సలహాదారుగా లేగ్గల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు పోచయ్య మాట్లాడారు. ఈ నెల 23న ఎల్లారెడ్డి మండల కేంద్రానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు. నేతలు నెల్లూరి గంగారాం, ద్యామని భూపతి, ఆశయ్య, రాజు, ఆగమయ్య, తదితరులు పాల్గొన్నారు.