
పాత జ్ఞాపకాలను పదిలం చేసేదే ఫొటోగ్రఫీ
కామారెడ్డి అర్బన్: ఫొటోగ్రఫీ అనేది జీవితాన్ని చిత్రీకరించే సృజనాత్మక కళ అని, పాత జ్ఞాపకాలను పదిలం చేస్తుందని అదనపు కలెక్టర్ చందర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఫొటోగ్రాఫర్లకు సన్మానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ఫొటోగ్రాఫర్లను సన్మానించి మాట్లాడారు. ఫోటో జ్ఞాపకాలపై రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ముస్కు జైపాల్‌రెడ్డి మాట్లాడారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు యాచం శంకర్, కార్యదర్శి సబ్బని కృష్ణహరి, ప్రతినిధులు పాల్గొన్నారు.
బాన్సువాడ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం బాన్సువాడలో ఘనంగా నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్ దండు సంజీవరావును సన్మానించారు. ఫోటోగ్రాఫర్లు గంగాధర్ యాదవ్, గోవర్ధన్, శేఖర్, వెంకటేష్, దత్తు, ఫయాజ్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఫొటోగ్రాఫర్లు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫొటోగ్రాఫర్లు కృష్ణ, విఠల్, భూపాల్, కార్తిక్ తదితరులున్నారు.