
డ్రంకెన్ డ్రైవ్‌కు సమాజ సేవ శిక్ష
కామారెడ్డి టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి సామాజిక సేవను శిక్షణ విధించింది కామారెడ్డి కోర్టు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు మంగళవారం కామారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ టి.చంద్రశేఖర్ నిందితుడికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించారు. ‘నేను మద్యం సేవించి వాహనం నడిపినందకు కోర్ట్ నాకు ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనం నడుపవద్దు’ అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నిల్చున్నాడు. ఇకపై మద్యం తాగి వాహనం నడపనని అతడు పేర్కొన్నాడు. ఈ వ్యక్తిని చూసైనా మద్యం తాగి వాహనాలు నడిపేవారిలో మార్పు వస్తుందేమో.
వినూత్న శిక్ష విధించిన కామారెడ్డి కోర్ట్