
కుట్టేస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పారిశుద్ధ్యం అ స్తవ్యస్తంగా మారడంతో దోమలు విజంభిస్తున్నాయి. దోమలు దండయాత్ర చేస్తుండడంతో జనం వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం ప్రపంచ దో మల దినోత్సవం సందర్భంగా కథనం..
జిల్లాలో దోమలు స్వైర విహారం చేస్తున్నా యి. ప్రజలను కుడుతుండడంతో జ్వరాలతో బాధపడుతున్నారు. జిల్లాలో యాభై రోజుల్లో యాభై డెంగీ కేసులు నమోదయ్యాయి. జూలై మాసంలో 26 కేసులు నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 24 కేసులు రికార్డయ్యాయి. అంటే రోజుకొకటి చొప్పున డెంగీ కేసు నమోదవు తోంది. రికార్డులకెక్కని కేసులు ఎన్నో ఉన్నా యి. టైఫాయిడ్ కేసులు లెక్కలేనన్ని నమోదవు తున్నాయి. ఇంటింటా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చాలామంది టైఫాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. కొందరు డెంగీ లక్షణాలు కనబ డగానే చికిత్సలు పొంది బయటపడుతున్నా.. మరికొందరు ప్లేట్‌లెట్స్ పడిపోయి ఆస్పత్రుల పాలవుతున్నారు.
కాగితాల మీదే దోమల నివారణ చర్యలు..
దోమల నివారణకు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోంది. పట్టణాలతో పాటు పల్లెల్లో దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలేవీ క్షేత్ర స్థాయిలో జరగడం లేదు. చాలా చోట్ల ఫాగింగ్ ఊసే లేదు. దీంతో దోమల వ్యా ప్తి ఆగడం లేదు. దోమలు పెరిగినకొద్దీ వ్యాధు ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా చైతన్యవంతులై దోమల నివారణకు తమ పరిసరాలను ప రిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.
విజృంభిస్తున్న దోమలు
పెరుగుతున్న వ్యాధులు
జిల్లాలో యాభై రోజుల్లో యాభై డెంగీ కేసులు
నేడు ప్రపంచ దోమల దినోత్సవం