పిట్లం: రైతులు సాధారణ యూరియా వాడ కాన్ని తగ్గించి నానో యూరియాను వాడితే ఖర్చులు తగ్గుతాయని డీఏవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పిట్లంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా లభ్యత, పంపిణీ వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, వీణ పాల్గొన్నారు.
‘పంచసూత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’
కామారెడ్డి అర్బన్: రాష్ట్రీయ సేవక్ సంఘ్ పంచసూత్రాలైన పర్యావరణం, సామాజిక సామరస్యం, స్వబోధ, పౌరమర్యాదలు, కుటుంబ జ్ఞానోదయం అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆడిటోరియంలో సంఘ్ విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు.
ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘ్‌చాలక్ బొడ్డు శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ సామాజిక అంశాలపై మాట్లాడారు. జిల్లాలోని ప్రతిగ్రామంలో శాఖలు ప్రారంభించి బలోపేతం చేయా లని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహకార్యవాహ కొమిరెడ్డి స్వామి, నగర కార్యవాహ కొత్తోళ్ల శివరాజ్ తదితరులు పాల్గన్నారు.
ఆయకట్టుకు ఢోకా లేదు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రెండు పంటలకు ఢోకా లేదని రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్ట్‌లు నిండటం ఆనందకరమన్నారు. ఎస్సారెస్పీని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

‘నానో యూరియాతో రైతులకు మేలు’