
నగరంలో ఏటీఎం చోరీకి యత్నం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలోగల ఎస్‌బీఐ ఏటీఎంను ముగ్గురు దుండగులు చోరీకి యత్నించారు. పోలీసులు రావడంతో మారుతి వ్యాన్‌లో పరారయ్యారు. వివరాలు ఇలా.. చంద్రశేఖర్ చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు మంగళవారం వేకువజామున ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి మారుతి వ్యాన్‌లో వచ్చా రు. వారి వెంట తీసుకువచ్చిన గ్యాస్‌కట్టర్‌లతో ఏటీఎంను కట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. నగదును ఎత్తుకెళ్లే సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో దుండగులు మారుతి వ్యాన్‌లో పరారైయ్యారు. వ్యాన్ బాసర వైపు వెళ్లడంతో పోలీసులు అన్ని పోలీస్‌స్టేషన్లను అలర్ట్ చేశారు. దీంతో నిందితులు నవీపేట్ మండలం పాల్దా వద్ద మారుతీవ్యాన్‌ను ఆపి, పారిపోయారు. చుట్టుపక్కల ప్రాంతంలో కొత్తవారు కనబడితే పోలీసులకు స మాచారం అందించాలని గ్రామస్తులకు తెలిపారు.
ముంబాయి మెయిన్ బ్రాంచ్‌కు మెసేజ్‌తో ఆలర్ట్
దుండగులు ఏటీఎం చోరీకి యత్నించడంతో ముంబాయిలోని మెయిన్ బ్రాంచ్‌కు మెసేజ్ వెళ్లడంతో అక్కడి సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనం ఏటీఎం వద్దకు వెళ్లడంతో నిందితులు పరారయ్యారు. ఏటీఎంను పూర్తిగా ధ్వంసం చేసిన ఎలాంటి నగదు పోలేదని ఎస్సై హరిబాబు తెలిపారు. ఘటన స్థలాన్ని సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. క్లూస్ టీం, సీసీఎస్ టీం అధికారులకు కేసు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కు
అందిన సమాచారం
అప్రమత్తమై, ఘటన స్థలానికి
చేరుకున్న పోలీసులు
పరారైన దుండగులు