
ట్రయల్ రన్ సక్సెస్
నిజాంసాగర్: ఆరేడ్ గ్రామ పరిసరాల్లో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్లకు మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక్కో గేటును 5 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ట్రయల్‌రన్‌ను జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్, ఏఈలు శివప్రసాద్, సాకేత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ కాశీనాథ్ పర్యవేక్షించారు. ఈ 20 గేట్లను ఎత్తడం 36 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అన్ని గేట్లు సక్రమంగా లేవడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తరలివచ్చిన జనం..
నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి జనం తరలివచ్చారు. ఈ గేట్లను 36 ఏళ్ల తర్వాత ఎత్తడం గమనార్హం. వేలాది మంది పర్యాటకులు తరలిరావడంతో ప్రాజెక్టు జనకళను సంతరించుకుంది.

ట్రయల్ రన్ సక్సెస్