
‘యూరియా కొరత రాకుండా చూడండి’
నిజాంసాగర్: యూరియా కొరత రాకుండా వ్యవసాయశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్దనున్న అచ్చంపేట సొసైటీ గోదామును ఆయన తనిఖీ చేశారు. నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే యూరియా విక్రయించాలన్నారు. రైతుల ముసుగులో యూరియా బస్తాలను ప్రైవేట్‌కు తరలిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఏవో మోహన్‌రెడ్డి, ఏవో అమర్‌ప్రసాద్, సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులున్నారు.
కామారెడ్డి టౌన్: నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన అదనపు తరగతుల నిర్మాణం అసంపూర్తి ఉంది. దీంతో 105 మంది విద్యార్థులు ఆరు బయట చదువుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. విద్యార్థుల అవసరం దృష్ట్యా కనీసం రెండు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయడానికి రూ. 4 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని డీఈవో రాజును ఆదేశించారు.