
మౌలిక వసతుల లేమి
సర్పాలతో సావాసం
దుర్వాసన భరించలేకున్నాం
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వం మండల కేంద్రంలో సుమారు 1 కోటి 25 లక్షల రూపాయిలతో 25 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సరైన స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా ఇళ్ల చుట్టూ వర్షపు నీరు నిలుస్తున్నాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. ఇప్పటికీ ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతూ ఆ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు.
డ్రెయినేజీకి కనెక్షన్ ఇవ్వని వైనం..
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినప్పటికి డ్రెయినేజీ కనెక్షన్ లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువైపోయాయి. అదేవిధంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే నీరు ఇంటి ముందే నిలవడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నీటి గుంతలతో పాటు పిచ్చి మొక్కలతో నిండిన ఖాళీ స్థలం ఉండడంతో ప్రతిరోజు రాత్రి పూట ఇళ్లలోకి పాములు, విష పురుగులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో పూర్తి సౌకర్యాలు కల్పించి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పాములు, విష పురుగులు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నాం. రాత్రి పూట బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.
– మంగళి రాజమణి, పెద్దకొడప్‌గల్ డబుల్ బెడ్ రూం కాలనీవాసి
సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేకపోవడంతో ఇళ్ల ముందు మురుగు నీరు నిలవడంతోపాటు వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. మురుగు నీరు ఇళ్ల చుట్టూ నిల్వ ఉండడంతో దుర్వాసన భరించలేకున్నాం. దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం.
– గడ్డం రాజు, డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసి
సమస్యల వలయంలో పెద్దకొడప్‌గల్
డబుల్ బెడ్ రూం కాలనీ ఇళ్లు
సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేక
ఇళ్ల ముందే నిలిచిన మురుగు నీరు
పట్టించుకోని అధికార యంత్రాంగం

మౌలిక వసతుల లేమి

మౌలిక వసతుల లేమి

మౌలిక వసతుల లేమి