
రైతులకు అండగా బీకేఎస్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఉంటుందని సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటలో గల శ్రీ కోదండ రామాలయం కల్యాణ మండపంలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో రైతులందరూ సంఘటితం కావాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సంఘంలోని ప్రతి సభ్యుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంఘ్ ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్‌రావు, రాష్ట్ర కోశాధికారి మాణిక్య రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల శంకర్‌రావు, నాగిరెడ్డిపేట మండలాధ్యక్షుడు కాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణురావు తదితరులు పాల్గొన్నారు.