
ఆర్ట్స్ కళాశాలలో బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో సోమవారం బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త శ్రీవల్లి మాట్లాడుతూ సహజ సిద్ధంగా లభించే కలబంద, పసుపు, తేనె, నిమ్మరసం లాంటి పదార్థాలను ఉపయోగించి అందం పెంపొందించే విధానాలను తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు దినకర్, మానస తదితరులు పాల్గొన్నారు.
‘రైతులు డ్రోన్ సేవలు
వినియోగించుకోవాలి’
కామారెడ్డి అర్బన్: పంటలపై పురుగు మందుల పిచికారి కోసం రైతులు డ్రోన్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. డ్రోన్‌తో పురుగు మందుల పిచికారి ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు డ్రోన్‌లకోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
22న కలెక్టరేట్‌లో
జాబ్‌మేళా
కామారెడ్డి అర్బన్: మెదక్ ఐటీసీ ఫుడ్ డివిజన్‌లో 20 మిషన్ అపరేటర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ లేదా ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 29 ఏళ్లలోపువారు ఈనెల 22న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 87907 37320, 76719 74009 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‘న్యాయవాదుల సమస్యలను
సీఎం దృష్టికి తీసుకెళ్తా’
కామారెడ్డి టౌన్ : న్యాయవాదుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్‌గౌడ్ న్యాయవాదుల సమస్యలను అశోక్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కై లాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ సోషల్ మీడియా ఇన్‌చార్జి ముబిన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, లీగల్ సెల్ ప్రతినిధులు ఉమాశంకర్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంగోపాల్‌రావు, నర్సింహారెడ్డి, సిద్ద్దరాములు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ట్స్ కళాశాలలో బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు