
36 ఏళ్ల తర్వాత..
నేడు నిజాంసాగర్ 20 గేట్లకు ట్రయల్‌రన్
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ముప్పై ఆరేళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు చివరన ఉన్న 20 గేట్లను ఎత్తనున్నారు. మంగళవారం ఈ గేట్లను ఎత్తి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు మూడు చోట్ల కలిపి 48 గేట్లున్నాయి. నిజాంసాగర్‌కు ఒకవైపు 12, మధ్యలో16, ఇంకోవైపు 20 గేట్లున్నాయి. సాధారణంగా మధ్య లో ఉన్న 16 గేట్లను, అవసరానుగుణంగా ఒకవైపు ఉన్న 12 గేట్లను ఎత్తుతుంటారు. 20 గేట్ల ను భారీ ఇన్‌ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఎత్తు తారు. 1988 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రా జెక్టుకు 3 లక్షల క్యూసెక్కులు, 1989 సంవత్సరంలో 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో ఈ 20 గేట్లను ఎత్తి నీటిని మంజీర నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం భారీ వరద వస్తుండడంతో డ్యాం సేఫ్టీ దృష్ట్యా ఈ 20 గేట్ల ను ఎత్తాలని నిర్ణయించారు. ఒక్కో గేటును 5 ఫీట్ల మేర లేపి, నీటిని దిగువకు వదులుతూ ట్ర యల్ రన్ నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిపుణుల బృందం గేట్ల పనితీరును పరిశీలిస్తుందన్నారు. నీటి విడుదల నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతంలో బోర్లు, పైపులైన్లు, కరెంట్ వైర్లు కలిగి ఉన్న రైతులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.