
‘నానో యూరియా ఎంతో ప్రయోజనకరం’
కామారెడ్డి క్రైం: యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించాలని, ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 మిల్లీలీటర్ల నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానమని, ధర కూడా తక్కు వని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయన్నారు. డ్రోన్ సహాయంతో సులభంగా పిచి కారి చేయవచ్చన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సొసైటీ ల ముందు క్యూలు ఉండకుండా గ్రామాల వారీగా తేదీలను కేటాయించి యూరియా సరఫరా చేయాలన్నారు. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా పరిశ్రమలు, వస్తు తయారీ ఇండస్ట్రీలలో తనిఖీలు చేయాలన్నారు. ఆయన వెంట డీఏవో మోహన్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు ఉన్నారు.