
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్‌లో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, యువకులు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలోయువకులు ఆనందోత్సవాల మధ్య ఉట్టిని కొట్టారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. వీడీసీ చైర్మన్ ఏనుగు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం, రాజిరెడ్డి, ముకేష్‌గౌడ్, రాజయ్య, మల్లేష్, మనోహర్, బాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోపాల్‌పేటలో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో గోకులాష్టమి వేడుకలను స్వాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణతో ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామప్రధాన కూడళ్లల్లో చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దీంతోపాటు చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు