
నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండ లా మారుతుండడంతో సోమవారం గేట్లు ఎత్తను న్నారు. ఎగువన ఉన్న పోచారం ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, మంజీర నది, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఆదివారం 90వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 1,402.37 అడుగుల (14.162 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి తరువాత గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సోమవారం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
ప్రాజెక్టు సమాచారం..