
గత ప్రభుత్వం చేసిన తప్పులతోనే ఊరిలోకి వరద
● చిన్న ఎక్లారలో పర్యటించిన
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
● రైతులను ఆదుకుంటాం
మద్నూర్(జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చిన్న ఎక్లార గ్రామంలో వరద నీరు వచ్చి చేరిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని చిన్న ఎక్లారలో శనివారం వరద నీరు గ్రామంలోకి చేరడంతో పాటు భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్న ఎక్లార గ్రా మంలో పర్యటించారు. గ్రామంలోని వాగు వరద నీ రు ఊర్లోకి వెళ్లినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యేతో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల క్రితం గ్రామంలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లోపంతో నిర్మించడంతో కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారన్నారు. చెక్‌డ్యాంకు మరమ్మతులు చేయించి తిరిగి వరద నీరు ఊర్లోకి రాకుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. వర్షాలతో గ్రామ శివారులోని 6 నుంచి 7 వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ను ఆదుకుంటుందని భరోసా ఇస్తున్నానని, తక్షణమే వ్యవసాయ అధికారులచే పంట నష్టంపై సర్వే నిర్వహించాలని ఆదేశించానని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు హన్మాండ్లు స్వామి, సాయిపటేల్, నాగేశం, మహేశ్, గ్రామస్తులున్నారు.