
కన్నాపూర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తా
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
● వర్షంలోనే కొనసాగిన
ఎమ్మెల్యే పర్యటన
రామారెడ్డి: వర్షాలు ముగిసిన వెంటనే మండలంలోని కన్నాపూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శనివారం రామారెడ్డి మండలంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పర్యటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కన్నాపూర్ మత్తడివాగు వాగును వర్షంలోనే ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలోనే సంబంధిత మంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. 40 ఏళ్లుగా కన్నాపూర్ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు కన్నాపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే పరిష్కారిస్తామన్నారు. పనులకు సంబంధించిన విషయమై అక్కడి నుంచే ఎమ్మెల్యే డీఈ బాల్‌లింగంతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం కన్నాపూర్, కన్నాపూర్ తండా, పోసానిపేట్,ఉప్పల్‌వాయి గ్రామాల్లో వర్షంలోనే ఎమ్మెల్యే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో తిరుపతిరెడ్డి, హౌసింగ్ ఏఈ సుచిత్ర, సీడీసీ చైర్మన్ ఇర్షద్, డైరెక్టర్ రవుఫ్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్‌రావు, రూపేందర్‌రెడ్డి, రంగు రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్, సంగోజివాడి గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మదన్‌మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా కల్యాణ లక్ష్మీచెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. మండల కేంద్రంలో తమసమస్యలు తీర్చాలని కోరుతూ ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో సాజీద్‌అలీ, శివాజీ, లక్ష్మణచారీ, షౌకత్‌అలీ, సుధాకర్‌రావు, శ్యాంరావు, మేకల రాజు, రాంచంద్రం,గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.