
గ్రామాల్లో పండగ వాతావరణం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నూతన రేషన్‌కార్డుల పంపిణీతో గ్రామాల్లో నూతన పండగ వాతవరణం నెలకొందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని గోపాల్‌పేట రైతువేదికలో లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్‌తో కలిసి ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల మంజూరుతో పేదల నిరీక్షణకు తెరపడిందన్నా రు. నూతన కార్డుల మంజూరు, పాత కార్డుల్లో పేర్ల నమోదుతో పేదలు ఆనందంగా ఉన్నార న్నారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో 6,934 మందికి నూ తన రేషన్‌కార్డులు మంజూరయ్యాయని, మొద టి విడతలో 2,616 కార్డులను లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. ప్రజాసంక్షేమమే మొదటిప్రాధాన్యతగా రేషన్‌కార్డులను పంపిణీ చేశామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అనంతరం తెలంగాణ వేర్ హౌసింగ్ గోదాము నిర్మా ణం కోసం మాల్తుమ్మెద శివారులోని సర్వే నంబర్ 834లో తొమ్మిది ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే మదన్‌మోహన్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్ రజితారెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్‌కార్డుల మంజూరుతో
నిరీక్షణకు తెర
ప్రజాసంక్షేమమే మొదటి ప్రాధాన్యత
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
మదన్‌మోహన్‌రావు