
తెయూకుఇంజినీరింగ్ కళాశాల
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో నెంబరు 32 జారీ చేసింది. ప్రజలు, విద్యార్థులు, విద్యావంతుల నిరంతర పోరాటాలు ఎట్టకేలకు ఫలించాయి.
తెయూ(డిచ్‌పల్లి): పదేళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడం ఆనందంగా ఉందని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తెయూ పరిపాలనా భవనంలో మీడియాతో వారు మాట్లాడారు. గతంలో తాను వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల ఇస్తానని స్వయంగా చెప్పారని, ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో నెంబర్ 32ను గురువారం జారీ చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు.
మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ రెండో విడత కౌన్సెలింగ్ కొనసాగుతున్నందున మూడో విడత కౌన్సెలింగ్‌లో తెయూ ఇంజనీరింగ్ కళాశాల పేరు చేర్చి సీట్ల భర్తీ చేపడతారని వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.
అందుబాటులో ఫ్యాకల్టీ, కాలేజ్ భవనం
తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఇటీవలే రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్ కాలేజీ భవనం సిద్ధంగా ఉందని వీసీ తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు, కంప్యూటర్ సైన్స్ కోర్సులు బోధించేందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ, ముగ్గురు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులు అందుబాటులో ఉన్నారన్నారు. అవసరమైతే గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తామన్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఆగస్టు 15లోపు జిల్లా పర్యటనకు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. అలాగే వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు.
సౌత్ క్యాంపస్‌లో సంబురాలు
భిక్కనూరు: తెలంగాణ యునివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు కావడాన్ని హర్షిస్తూ డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థు లు, అధ్యాపకులు గురువారం సౌత్ క్యాంపస్‌లో సంబురాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ క ళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకు న్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్ నేత, సరి త, సత్యం, రమేశ్, అధ్యాపకులు అంజయ్య, మోహన్‌బాబు, యాలాద్రి పాల్గొన్నారు.
జీవో జారీ చేసిన ప్రభుత్వం
నాలుగు కోర్సులకు అనుమతి
మూడో విడత కౌన్సెలింగ్
ద్వారా సీట్ల భర్తీ
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు

తెయూకుఇంజినీరింగ్ కళాశాల