
కేంద్రప్రభుత్వ పథకాలపై అధికారుల అధ్యయనం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):నాగిరెడ్డిపేట మండలంలో ని వాడి, అక్కంపల్లి గ్రామాల్లో కేంద్రప్ర భుత్వ పథ కాల అమలుతీరుపై గురువారం కేంద్రబృందం అఽ దికారులు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రబృందం అధికారులు ఉపాధిహామీ కూలీలతోపాటు పింఛన్‌దారులతో,మహిళాసంఘాల సభ్యు లతో సమావేశమయ్యారు. గ్రామాల్లో ఉపాధి పను లు కొనసాగుతున్న తీరును కూలీలను అడిగి వారు తెలుసుకున్నారు.దీంతోపాటు వికలాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్ డబ్బుల చెల్లింపులపై వారు ఆరా తీశారు.మహిళాసంఘాల ఆర్థికాభివృద్ధిపై వారు వి వరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరుల తో మాట్లాడారు. కేంద్రప్రభత్వు పథకాలైనా ఉపాధిహామీ పథకంతోపాటు పింఛన్లు, మహిళాసంఘాల సభ్యులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నామన్నారు.ఉపాధిహామీ పథకం అమలులో ఏమైనా లోటుపాట్లు జరిగితే భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడతామని వారు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రబృందం సభ్యులు సుధాకర్‌రెడ్డి, లోహిత్‌రెడ్డి, ఐకెపీ ఏపీయం జగదీశ్‌కుమార్, ఈజీఎస్ ఏపీవో సాయిలు, పంచాయతీ కార్యదర్శులు నరేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.