
చిన్నారులపై చిన్నచూపు!
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పెరిగేలా తల్లికి పౌష్టికాహారం అందించడం నుంచి బుడిబుడి అడుగులు వేస్తూ కేంద్రానికి చేరుకునే చిన్నారుల వరకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని పాలకులు చెబుతున్నా ఇప్పటికీ సగం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. జిల్లాలో 1,193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. 617 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 336 కేంద్రాలు అద్దె భవనాల్లో, 240 కేంద్రాలు రెంట్ ఫ్రీ భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏమోగానీ పట్టణాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరకడం కష్టం. దొరికినా అందులో సరైన సౌకర్యాలు ఉండవు. అంగన్‌వాడీ టీచర్, ఆయాలతో పాటు పిల్లలకు మూత్రశాలలు ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నా సరైన సౌకర్యాలు లేవు. దీంతో అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాగునీటికి తప్పని కష్టాలు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సమస్య కూడా వెన్నాడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 207 కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేదు. ఆయా కేంద్రాల ఆయాలు సమీపంలోని ఇళ్లకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా కనెక్షన్లు ఇవ్వడంగానీ, మరే రకమైన సౌకర్యం గానీ కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లాలో 202 అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ఆయా కేంద్రాల్లో చిన్నారులకు కనీసం ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎండాకాలంలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అంగన్‌వాడీ కేంద్రాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవనాలు నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విడతల వారీగా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. పాలకులు ఇప్పటికై నా స్పందించి, అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న మూడో అంగన్‌వాడీ కేంద్రం
ఆయాల్లేక అవస్థలు..
జిల్లాలో 433 కేంద్రాల్లో సహాయకురాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్లే ఆయా అవతారం ఎత్తాల్సిన పరిస్థితి ఉంది. గర్భిణులు, బాలింతలతో పాటు పిల్లలకు అన్నం వండి పెట్టాల్సిన బాధ్యత టీచర్లే మోస్తున్నారు. మీటింగ్‌లకు వెళ్లాలంటే కేంద్రాన్ని మూయాల్సి వస్తోంది. సొంత పని ఉండి సెలవు తీసుకున్నా కేంద్రానికి తాళం వేయాల్సిందే.. అలాగే జిల్లాలో 99 కేంద్రాలకు టీచర్లు లేరు. పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కార్యరూపం దాల్చడం లేదు. ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది.
న్యూస్‌రీల్
ఆరు బయటికే..
జిల్లాలోని దాదాపు సగం అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయ్‌లెట్స్ లేవు. జిల్లాలో 1,193 కేంద్రాలు ఉంటే 515 కేంద్రాల్లో మూత్రశాలలు లేవని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. దీంతో పిల్లలు ఆరుబయటనే వెళ్లాల్సి వస్తోంది. కేంద్రాల పరిసరాల్లో పిల్లలు టాయ్‌లెట్‌కు వెల్లినపుడు ఏదేని విషపురుగులు కాటేసే ప్రమాదం ఉంది. టాయ్‌లెట్స్ లేకపోవడంతో టీచర్లు, ఆయాలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఓట్ల కోసం కమ్యూనిటీ హాళ్ల పేరుతో కుల సంఘాల భవనాలకు పోటీ పడి నిధులిచ్చే నేతలు.. అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో చాలాచోట్ల కనీస వసతులు కూడా లేవు. అసౌకర్యాల మధ్యే చదువులు కొనసాగించాల్సి రావడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో
అరకొర సౌకర్యాలు
సగం కేంద్రాలకే సొంత భవనాలు
తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కరువు
515 కేంద్రాల్లో
టాయ్‌లెట్స్ లేక ఇబ్బందులు
పట్టించుకోని పాలకులు

చిన్నారులపై చిన్నచూపు!

చిన్నారులపై చిన్నచూపు!

చిన్నారులపై చిన్నచూపు!

చిన్నారులపై చిన్నచూపు!