పక్కాగా మహిళాశక్తి అమలు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా మహిళాశక్తి అమలు

Aug 2 2025 6:17 AM | Updated on Aug 2 2025 6:17 AM

పక్కా

పక్కాగా మహిళాశక్తి అమలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఇప్పటికే అనేక విజయాలు సాధించామని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి సురేందర్‌ పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వారు ఆయా రంగాల్లో సక్సెస్‌ సాధించేలా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మ హిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా నాలుగు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ క్యాంటీన్‌లు మన జిల్లాలో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కొత్తగా 2,892 చిరు వ్యాపారాలు ఏరాటు చేయాలని, 8,677 పాత వాటిని విస్తరించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,665 పూర్తి చేసి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గతంలో 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా, ఈసారి 181 ఏర్పాటు చేసి లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. దీంతో మహిళా సంఘాలకు రూ. 3కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

పలు చోట్ల ప్రయత్నాలు..

జిల్లాలో కామారెడ్డి, నస్రుల్లాబాద్‌ మండలాల్లో పె ట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా యని డీఆర్‌డీవో తెలిపారు. రెవె న్యూ అధికారులు ఇప్పటికే భూమి కేటాయించారని వివరించారు. నాగిరెడ్డిపేట మండలం మత్తమల్‌ వద్ద ఏర్పాటుకు భూమి చూపించినప్పటికీ నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆగామన్నారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత బంక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

మీ సేవా కేంద్రాలు...

మహిళా సంఘాల ఆధ్వర్యంలో 15 మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వాటి కి సంబంధించి కసరత్తు నడుస్తోందని డీఆర్‌డీవో వివరించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఈ త్రైమాసిక లక్ష్యం మేరకు రూ.200 కోట్లు ఇచ్చామన్నారు.

సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు...

నాగిరెడ్డిపేట, పిట్లం మండలాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సురేందర్‌ తెలిపారు. భూమి ఏ మేరకు అనుకూలమన్న దానిపై సర్వే నడుస్తోందన్నారు.

రైస్‌మిల్లులు..

జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీఆర్‌డీవో పేర్కొన్నారు. దోమకొండ, జుక్కల్‌ మండలాల్లో ఏర్పాటుకు కసరత్తు సాగుతోందన్నారు. ఫుడ్‌, వెజిటబుల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో డీఆర్డీవో ఆధ్వర్యంలో 400 పాడి గేదెలు ఇవ్వాలన్న లక్ష్యంగా ఉండగా 264 అందించామన్నారు. కోళ్ల పెంపకం మదర్‌ యూనిట్లు 22 లక్ష్యం కాగా 11 పూర్తియ్యాయని తెలిపారు. సంఘాల్లో కొత్తగా 7 వేల మంది సభ్యులను చేర్పించాలన్న లక్ష్యం మేరకు ఇప్పటికే 2 వేల మందిని చేర్పించామని వివరించారు.

చిరు వ్యాపారాలకు

అధిక సంఖ్యలో గ్రౌండింగ్‌

పెట్రోల్‌ బంక్‌లు, రైస్‌మిల్లుల

ఏర్పాటుకు ప్రయత్నాలు

‘సాక్షి’తో జిల్లా గ్రామీణాభివృద్ధి

అధికారి సురేందర్‌

పక్కాగా మహిళాశక్తి అమలు1
1/1

పక్కాగా మహిళాశక్తి అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement