
చర్చాగోష్టి.. ప్రత్యేక కథనాలు
● ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు
తెయూ(డిచ్‌పల్లి) : తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ‘సాక్షి’ తనవంతు కృషి చేసింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాను సందర్శించిన సమయంలో తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 12 ఏప్రిల్ 2025న ‘సాక్షి’ టౌన్ ఆఫీస్‌లో వివిధ విద్యార్థి సంఘాల ఆ ధ్వర్యంలో ‘తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి’ అ నే అంశంపై చర్చాగోష్టి నిర్వహించింది. జూ లై 8న ‘మంజూరు చేస్తే చాలు’ అనే కథనా న్ని ‘సాక్షి’ ప్రచురించింది. 577 విశాలమైన క్యాంపస్‌తోపాటు సైన్స్ కాలేజ్ భవనం, మౌ లిక వసతులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉ న్నాయంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.