
ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలి
సదాశివనగర్/కామారెడ్డి అర్బన్/రాజంపేట : ఉపాధ్యాయుల విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండవ దశ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు అన్నారు. గురువారం సదాశివనగర్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆగస్టు 5న ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుఎస్‌పీసీ జిల్లా ప్రతినిధి దేవుల, డీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిన్న రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు. అలాగే దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీ ప్రభాకర్, టీచర్లు ఆవిష్కరించారు.ఉపాధ్యాయులు గంగాకిషన్, బాబురావు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఎంఈవో పూర్ణచందర్ రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం డి. ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు కలిసి ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.