దోమకొండలో కరాటే పోటీలు
దోమకొండ: మండల కేంద్రంలో శుక్రవారం ఒకినోవా గోజరో నీడుకాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. సంస్థ తెలంగాణ ఆర్గనైజర్ కరాటే గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య ఆధ్వర్యంలో 155 మంది క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. పోటీలకు జర్మనీ దేశానికి చెందిన కరాటే గ్రాండ్ మాస్టర్ హన్షీ ఫీటర్, షిహన్‌సోల్, బెల్జియం దేశానికి చెందిన షిహన్ రెయిన్ హోమ్స్ హాజరైనట్లు రాజయ్య వివరించారు. కరాటే సీనియర్ బ్లాక్ బెల్ట్ మాస్టర్‌లు కామిండ్ల నవీన్‌కుమార్, స్వామి, సాయినాథ్‌గౌడ్, సంతోష్, లక్ష్మినర్సు, సిద్ధరాములు, కుమార్, సాత్విక్, రోహిత్, హరిప్రసాద్, సిద్ధరాములు, సుభాష్ పాల్గొన్నారు.


