ర్యాష్ డ్రైవింగ్.. రోడ్డుపై నిలబెట్టింది
ఖలీల్‌వాడి: ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇద్దరు యువకులను స్వయంగా పట్టుకున్న సీపీ సాయిచైతన్య.. సామాజిక సేవ చేయాలని వారికి సూచించారు. శనివారం రాత్రి నగరంలోని కోర్టు చౌరస్తా మీదుగా ఇద్దరు యువకులు బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సీపీ వాహనం పక్కనుంచే వెళ్లగా ఆయన గమనించి వెంటనే వారిని పట్టుకున్నారు. వారిలో ఒకరిని ఎన్టీఆర్ చౌరస్తా, మరొకరిని కోర్టు చౌరస్తాలో నిలబెట్టి వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో ఇద్దరు యువకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్లకార్డులను ప్రదర్శించారు.
ర్యాష్ డ్రైవింగ్.. రోడ్డుపై నిలబెట్టింది


