
ధాన్యం తూకం త్వరగా ప్రారంభించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ధాన్యం తూకం త్వరగా ప్రా రంభించాలని కొనుగోలు కేంద్రాల జిల్లా మానిటరింగ్ అధికారి రాధిక సూచించారు. గురువారం ఆ మె మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రై తులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి 10 రోజులు దాటిపోతున్నందున వెంటనే తూకం ప్రా రంభించాలని సొసైటీ సీఈవో పెంటయ్యకు సూ చించారు. అంతకు ముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ కొనుగోలు కేందంలో ధాన్యం తేమశాతా న్ని పరిశీలించారు.అకాల వర్షాల కారణంగా రైతు లు నష్టపోకుండా వెంటనే తూకం ప్రారంభించాల ని సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. తూకం వేయడానికి హమాలీల కొరత ఉందని సీఈవో పెంట య్య ఆయన దృష్టికి తెచ్చారు. తొందరగా హమాలీలను ఏర్పాటు చేసుకొని సోమవారం లోపు తూకం ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
నస్రుల్లాబాద్(బాన్సువాడ): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని డీఆర్‌డీవో సురేందర్ అన్నారు. గురువారం మండలంలో అంకోల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వాతావరణం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించాలన్నారు. ఐకేపీ ఏపీఎం గంగాధర్, రైతులు ఉన్నారు.