దళారులను నమ్మి మోసపోవద్దు
పిట్లం(జుక్కల్): దళారులను నమ్మి మోసపోవద్దని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జొన్నలకు క్వింటాల్‌కు రూ.3,371 గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ శపథంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, డైరెక్టర్లు, నాయకులు, సహకార సంఘం కార్యదర్శి సంతోష్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
కామారెడ్డి టౌన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమా ర్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించా రు. మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం జీజీహెచ్‌ను సందర్శించారు. రోగులతో ఆయన మాట్లాడగా నీటి సమస్య ఉందని వారు తెలిపారు. ఆపరేషన్ థియే టర్, ప్రసూతి, మహిళ, పురుషుల వార్డులు, మెడికల్ డ్రగ్స్‌స్టోర్, ల్యాబ్, డయాలసిస్, ఐసీయూ విభాగాలను సందర్శించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ షరీదా డీఎంఈకి వివరించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, ఆర్‌ఎంవో రవీందర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు చట్టాలపై అవగాహన
కామారెడ్డి టౌన్: పట్టణ శివారులోని వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి నాగరాణి గురువారం సందర్శించారు. న్యాయచైతన్య సదస్సు ఏర్పాటు చేసి వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయూష్ వి భాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పా టు చేసి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు మల్లిక, దేవయ్య, శ్రీకాంత్, ఫార్మాసిస్ట్‌లు రాజ్యలక్ష్మి, పద్మ, కిశోర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి
మద్నూర్(జుక్కల్): గర్భిణులు నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల అన్నారు. మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో సీడీపీవో కళావతి, ఎంపీడీవో రాణి, ఏఐఐ ఎంఎస్ జిల్లా కో ఆర్డినేటర్ మోహన్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రియాంక, బాలకృష్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
దళారులను నమ్మి మోసపోవద్దు
దళారులను నమ్మి మోసపోవద్దు


