ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేయాలని కామారెడ్డి జిల్లా ఏబీవీపీ పూర్వ నాయకులు బుధవారం తిరుపతిలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం, చుక్కాపూర్ లక్ష్మినర్సింహాస్వామి, ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ నాయకులు రణజీత్ మోహన్, జంగం నరేష్, కోడేం లక్ష్మిపతి, వంగారాహుల్, సంతోష్‌గౌడ్ తదితరులున్నారు.


