భిక్కనూరు: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవల్లో పాల్గొంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం సౌత్‌క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్ రిబ్బన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ఎన్‌ఎస్‌ఎస్ అధికారి బందెల అంజయ్య, అధ్యాపకులు మోహన్‌బాబు, ప్రతిజ్ఞ, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


