బాన్సువాడ: నియోజకవర్గంలో కొందరు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ విమర్శించారు. శనివారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ కలెక్టర్ వద్ద ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. బీర్కూర్ మండలం దామరంచకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇక్బాల్ అనారోగ్యంతో మరణిస్తే.. కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన వారు ఇబ్బందులు పెట్టడంతోనే చనిపోయినట్లుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. ఈజీఎస్ పనులు కాంగ్రెస్ కార్యకర్తలకే అప్పగిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను పాత కాంగ్రెస్ నాయకులకే ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నుంచి వచ్చిన రవీందర్‌రెడ్డి, హైదరాబాద్‌లో ఉండే యలమంచలి శ్రీనివాస్‌రావు పార్టీకోసం పని చేయాలిగానీ ఇలాంటి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. సమావేశంలో నాయకులు శంకర్, కాశీరాం, ఖాలేక్, మధుసూదన్‌రెడ్డి, అసద్, అప్రోజ్, సురేశ్‌గుప్తా, హన్మండ్లు, ఖమ్రొద్దీన్, ఎజాస్, రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.