కామారెడ్డి క్రైం: నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షా చట్టం’ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలన్నారు. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని వైద్యాధికారులకు సూచించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు..
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ కేంద్రాల పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలను తర చుగా వైద్య శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నా రు. నిబంధనలు పాటించని కేంద్రాల గుర్తింపు ర ద్దు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఏవైనా ఆస్పత్రులను నిర్వహిస్తుంటే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. ఆర్‌ఎంపీలపై నిఘా పెంచాలన్నారు. అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల చీటీ లేకుండా మందులు ఇస్తు న్న మెడికల్ షాప్‌లపైన చర్యలు తీసుకోవాలన్నా రు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు శిరీష, విద్య, ప్రభు కిరణ్, ఐఎంఏ కార్యదర్శి అరవింద్, అ ధికారులు వేణుగోపాల్, చలపతి పాల్గొన్నారు.
‘ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి సారించాలి’
కామారెడ్డి క్రైం: ఎల్‌ఆర్‌ఎస్, ఇంటి పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31 లోగా ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఇంటి పన్నుల వసూళ్ల కోసం నెలాఖరు వరకు సెలవు దినాలతో సహా ప్రతి రోజు కార్యాలయాలను తెరచి ఉంచాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రెగ్యులరైజ్ చేసుకునేలా ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మూడు బల్దియాల కమిషనర్‌లు రాజేందర్‌రెడ్డి, హేమంత్ రాజు, మహేశ్, టీపీవోలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.