చంపుతారనే భయంతో భార్య హత్య | - | Sakshi
Sakshi News home page

చంపుతారనే భయంతో భార్య హత్య

Jan 30 2025 1:53 AM | Updated on Jan 30 2025 1:37 PM

-

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

రెంజల్‌(బోధన్‌): భార్యపై అనుమానం.. ప్రియుడితో కలిసి తనను హత్య చేస్తుందనే భయంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన రెంజల్‌ మండలం బోర్గాం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. బోర్గాం గ్రామానికి చెందిన చిరడి పోతన్న, నీరడి స్వప్న(35) భార్యాభర్తలు. స్వప్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోతన్న అనుమానించేవాడు. అంతేగాక ప్రియుడితో కలిసి తనను చంపుతుందేమోనని భయపడేవాడు. 

ఈ క్రమంలో మంగళవారం పొలం వద్ద భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. అదేరోజు రాత్రి భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మళ్లీ తానే బుధవారం ఉదయం స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని జాలార్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌ తెలిపారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement