క్రీడా సమాచారం | - | Sakshi
Sakshi News home page

క్రీడా సమాచారం

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

జాతీయ క్రికెట్‌ పోటీలకు తస్యశ్రీ

దేవరపల్లి: స్థానిక భాష్యం స్కూల్లో పదో తరగతి చదువుతున్న గాదిరాజు తస్యశ్రీ 70వ నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–17 మహిళా క్రికెట్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ఎంపికై ంది. రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ పోటీల్లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్‌ పి.పేరయ్య నాయుడు తెలిపారు. ఈ నెల 15 నుంచి 20 వరకు జమ్మూలో జరిగే జాతీయ పోటీల్లో తస్యశ్రీ రాష్ట్ర జట్టులో పాల్గొంటుందన్నారు.

వాలీబాల్‌ పోటీలకు ప్రియ బాంధవి

అల్లవరం: దేవగుప్తం హైస్కూల్‌కు చెందిన బూల ప్రియ బాంధవి రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికై ంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలస్వామి గురువారం ఈ విషయం తెలిపారు. అనపర్తి ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో తమ విద్యార్థి అత్యంత ప్రతిభ చూపిందన్నారు. దీంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో అంబాజీపేట మండలం నేదునూరులో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు అర్హత సాధించిందన్నారు. కాగా.. ప్రియ బాంధవితో పాటు పీడీ రాజ్‌కుమార్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

హాకీ పోటీలకు చాగల్లు విద్యార్థులు

చాగల్లు: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగే రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చాగల్లు పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పీడీ జె.విజయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్‌లో జరిగిన జిల్లా స్థాయి అండర్‌–19 హాకీ ఎంపికల్లో తమ విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వారిలో బాలుర విభాగంలో ఎన్‌.మనోజ్‌ కుమార్‌, కె.కోమల్‌ కుమార్‌, జేడీ పవన్‌, బాలికల విభాగంలో జి.సింధు, ఎం.భవాని, డి.కృష్ణ శైలజ, బి.హేమ నవ్యశ్రీ, వి.శాంతి రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం సంపాదించారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌.వాసవి తదితరులు అభినందించారు.

ఊనగట్ల విద్యార్థినుల ప్రతిభ

చాగల్లు: ఊనగట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు ఎన్‌వీ రమణ తెలిపారు. నారాయణపురంలో నిర్వహించిన స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–14 బాలికల విభాగంలో 9వ తరగతి విద్యార్థిని తొర్లపాటి శశి ధరణి, 8వ తరగతి విద్యార్థిని కంచర్ల హనీ ప్రతిభ కనబరిచారు. వీరిద్దరూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. అండర్‌–17 బాలికల విభాగంలో 10వ తరగతి విద్యార్థిని పంతకాని లాస్య ఎంపికై ందని, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు అయినవిల్లి మండలం నేదునూరులో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఆ విద్యార్థినులతో పాటు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు కొయ్య గంగాధరరావును పలువురు అభినందించారు.

స్కేటింగ్‌లో తానీషా

రాజమహేంద్రవరం రూరల్‌: కాతేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 8వ తరగతి దివ్యాంగ విద్యార్థి ఇమామ్‌ తానీషా 64వ ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ (రోలర్‌ స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) స్కేటింగ్‌ జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవా అనిత తెలిపారు. కాకినాడలో ఈ నెల 11న జరిగిన 38వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ డిజేబుల్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 100, 500 మీటర్ల రేస్‌లో ఇమామ్‌ తానీషా ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడన్నారు. తద్వారా జాతీయ పోటీలకు అర్హత పొందాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement