ప్రత్తిపాడు రూరల్ (శంఖవరం): అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 30 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. శంఖవరం మండలం వేళంగి, పెదమల్లాపురం గ్రామాలకు చెందిన వీరు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో ఆ పార్టీకి జైకొట్టారు. మండలంలోని శృంగవరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అత్తిలి తేజ, గిట్ల చిన్నబాబు, వెల్దుర్తి శివాజీ, కొరుప్రోలు చిన్నారావు, ముర్ల సత్తిబాబు, తుంపాటి శ్రీను, బుటారి అప్పారావు, లోతా లోవరాజు, లోతా చిన్నలోవరాజు, తంటా బోడియ్య, తంటా శ్రీను, తుంపాటి శ్రీను, ముసర లోవరాజు తదితరులకు గిరిబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


